
కవిత: సంశయం
............
తన్నోడి నన్నోడేనా
లేక నన్నోడి తన్నోడేనా
అడిగే మనసు అనురాగంగా
జోడీ కట్టిన ప్రేమను
ఓడేది గెలిచేది ఎవరు
ప్రణయ పరీక్షలలో, పరిహాసమదేలా
తెలియక విషయం అడిగేవా
లేక అన్నీ తెలిసి అడుగుతున్నావా.. అమాయకంగా
పరుగులు తీసే వయసును
నిలువరించే శక్తి వున్నది ఒక్క ప్రేమకేగా
చివురులు వేసిన ప్రేమ తరువుకు
పూచే కాయలన్నీ ప్రేమ ఫలాలేగా
.............
No comments:
Post a Comment