ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

కవిత: నిశ్శబ్దమే బాగుండే 
............................
ఎదిగిన పెద్దల ఎదగని మాటలాడే వేళ 
ఎదగని పసిపాప బోసి నవ్వుల..నిశ్శబ్దమే బాగుండే 

మనసైన చెలి ప్రియ భాషణలు చేయు వేళ 
చల్లగాలీ చిరుసవ్వడీ భారమయ్యే...నిశ్శబ్దమే బాగుండే.. 

నవజంట ముద్దు ముచ్చట్లలో మురిసే వేళ..
అమ్మలక్కలు పరాచికాలతో సిగ్గులుపూయిస్తే..నిశ్శబ్దమే బాగుండే 

ఆలోచన స్రవంతిలో తలమునకలయ్యే వేళ
భావనాకడలిలో అలలే అల్లరిపెడితే..నిశ్శబ్దమే బాగుండే

ముసివున్న మదితలుపులను తలపులునెట్టే వేళ
మరుల సిరులే సిరిసంపదలైపోతే...నిశ్శబ్దమే బాగుండే

No comments: