
కవిత:అక్షరార్చన
....................
సుందర సుచరిత ముగ్ధవంటా
వలపు వ్రత ఫలమే నువ్వంటా
మధుర భాష్య మోహినివంటా
మధుపలాలసల శ్రీచందనారవిందం నీదంటా
ప్రణయ హ్రుద్య భావనంటా
ఎద తడిమే తడికి సాక్ష్యం నీవంటా
పరువాల నగవులే నీవంటా
నగలా మెరిసే నగుమోమే నీదంటా
తరిమే తలపులతో పడుకుంటా
నిదుర రాని కన్నులకు నీ తలపే పండగంటా
తలచే కలలో నీవంటా
కలత నిద్దురలోనూ నీ ధ్యానమేనంటా
మదిలో వ్యధలో తోడుంటా
కాదు కాదు వ్యధనే నీ చెంత రాకుండా చూసుకుంటా
చెలి చామంతివి నీవంటా
రవితేజ రసరాజుని నేనంటా
నిత్యం అనునిత్యం వెన్నుంటా
అచిరకాలం నీ అన్నుదన్నుగా నేనుంటా
.........
No comments:
Post a Comment