

కవిత: గానాల టంకసాల...ఘంటసాల
(ఈ రోజు మాహామనీషి పూజ్యులు శ్రీ ఘంటసాల మాష్టారి పుట్టినరోజు సందర్భముగా ఈ కవితా పుష్పగుచ్చం అంకితం)
..........................
ఎందుకెళ్ళినావయ్యా తొందరగా ఘంటసాల
జ్యోతివై పరంజ్యోతి చెంతకు మము వీడి
ఏడిపించితివేమయ్యా లోకాన్నంతా ఘంటసాల
గానమై గగనాల కుసమమై ఎగసి నింగికి
గుడిలో దేముని అర్చనకు నీ పాటే
గదిలో దేవేరి అలక తీర్చుటకు నీ పాటే
తల్లి బిడ్డల ప్రేమలకు నీ పాటే
పాట పద్యాల నాట్యాలకు నీ పాటే
విరి పుష్పాల వర్ణనకు నీ పాటే
చెలి సొగసు sogaగీతాలకు నీ పాటే
ప్రేమ చప్పుళ్ళ కేరింతలకు నీ పాటే
పద కవితల అక్షరార్చనకు నీ పాటే
కన్నె లలామ కవ్వింతకు నీ పాటే
వన్నె చిన్నెల వర్ణాలకు నీ పాటే
మది గంటల నగారాలకు నీ పాటే
విధి ఆటల వింతచేష్టలకు నీ పాటే
సుధా రసాల రాగాలకు నీ పాటే
నదీ జలాల సయ్యాటలకు నీ పాటే
సుఖ దుఖాల లాలనపాలనకు నీ పాటే
అది యిదేల లోక సర్వమునకు నీ పాటే
గాన గంధర్వుడువి గమకాల ఱేడువి నీవు ఓ ఘంటసాల
వాగ్దేవి వాణివి తెలుగుజాతి ఘనసంపదవి నీవు ఓ ఘంటసాల
సంగీత పయోనిధివి సుస్వరాల ద్రష్టవి నీవు ఓ ఘంటసాల
దొడ్డ మనస్కుడివి మనుషుల్లో ఋషివి నీవు ఓ ఘంటసాల
.........
No comments:
Post a Comment