ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013

Photo: కీర్తన: కావవే అంబే జగదంబే
......
జన్మమెత్తి జగతిన తిరిగితి తల్లి జగద్ధాత్రి 
తెలియక కొన్ని తెలిసి కొన్ని తప్పులు చేసితి తల్లి
అహంకారంతో కళ్ళు మూసుకుపోయి తప్పులు కోకొల్లలు చేసితి తల్లి
చేసిన తప్పులను కాయవమ్మా భవాని భాగ్యప్రదాయని 
...........
శైలపుత్రి శివాత్మకే శాంభవి ప్రణతు ప్రణతు
శుభంకరి సర్వార్ధకే సంభవి ప్రణతు ప్రణతు
సుగాయత్రి సత్యార్ధకే శాంకరి ప్రణతు ప్రణతు
సుమగాత్రి సిధ్యర్ధకే శ్రీకరి ప్రణతు ప్రణతు

సువాసిని శ్రీరంజని సద్భుద్దిదేహికే ప్రణతు ప్రణతు
సుహాసిని సౌధామిని శ్రీవిద్యాదేహికే ప్రణతు ప్రణతు
శివాత్మిని శ్రీధామిని సర్వశుభకర్ణికే ప్రణతు ప్రణతు
సునయని సౌభాగ్యని సౌమ్యస్వరూపే ప్రణతు ప్రణతు

సుచరితి సురమ్య శక్తిరూపికే ప్రణతు ప్రణతు
సులక్షణి సుస్మిత సత్పాలికే ప్రణతు ప్రణతు
సుభాషిణి శ్రీచరణి సూక్ష్మరూపికే ప్రణతు ప్రణతు
సరస్వతి శ్రీవాణి సాక్షీభూతికే ప్రణతు ప్రణతు

శుభదేహి సిద్దేస్వరి శూలాపాణి ప్రణతు ప్రణతు
శ్రుతరాజ్ఞి స్నిగ్దేస్వరి సుధారాణి ప్రణతు ప్రణతు
సిద్ధిబుద్ధి సర్వేశ్వరి శ్రితరక్షిణి ప్రణతు ప్రణతు
సత్యవతి శ్రియంకరి సన్నుతరక్షిణి ప్రణతు ప్రణతు
...........
నీ చల్లని చూపులు సోకితే జగదంబే
పాపములన్నీ పటపంచలయ్యేగా 
నీ కరుణ క్రుపలు కలిగితే జగదంబే 
పాతకములన్నీ నష్టమయ్యిపొయ్యేగా 

చేసెద నీ నామస్మరణ సతతం అమ్మా చాముండి
పాడేద నీ జయకీర్తనలే నిత్యం జనని జాహ్నవి

కీర్తన: కావవే అంబే జగదంబే

No comments: