
కవిత: నీకై భామిని కై
..........
నీకై ఎగిరే పయటకు ఏమని చెప్పి ఆపను
నీకై సవ్వడి చేసే గుండెకు ఏమని చెప్పి ఊరడించను
నీకై ఉరకే వయసు గుర్రాన్ని ఎట్టా కళ్ళెమేసి ఆపను
నీకై మ్రోగే పాంజీరాల మువ్వల గొడవను ఎట్టా భరించను
నీకై మెరిసే ప్రత్యుష వెలుగులను ఎట్టా ఓపను
నీకై కురిసే ప్రణయ జల్లులను ఎట్టా పట్టను
నీకై విరిసే యవ్వన లావణ్యాన్ని ఎట్టా దాచను
నీకై తడిమే తలపు లోలోతుల్ని ఎట్టా నింపను
నీకై పలికే మనసు సంగతుల్ని ఎట్టా పాడను
No comments:
Post a Comment