
కవిత: మార్పు
..........
గంట మ్రోగక గుడిలో గంటకు విలువుండునా
ఉలిపోటు పడక శిలారూపం శివారూపం అందునా
పూలు వికసించక తోటలో పూలపరిమళాలు నిండునా
తుమ్మెద తిరుగాడక పుష్పరాజం చిరునవ్వులు చిందించునా
చూపు కరువైనాక కంటిపాప వెలుగులు పంచునా
ప్రక్రుతిలో అందాలను చూడక నేత్రాల ఆత్రాలు తీరునా
ప్రేమ దూరమైనాక హ్రుదయం ఉషోదయాలను ఆస్వాదించునా
వలపు పలకరించక మనసుగుడిలో ప్రేందీపం వెలుగునా
చెలిమి చేరువకాక డెందం సంతోషాన్ని చవిచూడునా
చైత్రమే రాక యువనవజవసత్వాలకు ఆటవిడుపు దొరుకునా
.....
విసురజ
No comments:
Post a Comment