
కవిత: మది వాణి
...................
పగటి వెలుగులో నీ రూపమే
నింగిలో సింధూరమై నిఖిలంగా నిలిచే
చీకటి నలపుల్లో నీ తలపే
రేరాణి (నైట్ క్వీన్) పరిమళమై నిత్యంగుభాళించే
సన్నని నీరెండ నిన్ను తాకి
నీలవర్ణమై మిల మిలా మెరిసే
స్రుసించి అల్లరి పిల్లని మెల్లంగా చల్లగాలి
చందన సుగంధాలను సొబగును సంతరించుకునే
సుస్వర స్వరాల గమకాల తమకాలతో
మదియామిని వసంత గానం వినిపించే
మనసే ఎదను తనకీ తడిమితే
బుగ్గల్లొ సిగ్గులే సంపెంగలై విచ్చుకునే
ఆసక్తితో కూడిన చెలువంపై అనురక్తి
గుభాళించే హ్రుది సౌరభాలను వినుతిచేసే
సోకుల పరువాల యవ్వనపు పరుగే
ఉషస్సున జగత్తులో నిత్యప్రేమగీత వల్లరయ్యే
విరిసి పూలతికే లావణ్యాలముగ్ధయ్యే
లేదనిపించే నడుము చిన్ని నోరు నాదనిపించే
వలపు రాహిత్యంలో కొడగట్టిన ప్రాణాలకు
మనసైన నేస్తమే కొత్తూపురుల నెత్తావులు అందించే
..........
No comments:
Post a Comment