ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

PhotoPhoto

కవిత: ఎవరివో నీవు 
.......
మరల వచ్చిన యామినివా 
మది ముంగిలిలోని వర్ణానివా 
ఎవరు నీవు పదకవితా రాణివా

తరలి ఏతెంచిన వనదేవతవా
పాట వినిపించే వేణుగానానివా
ఎవరు నీవు వీణాపాణి నాదానివా

వాడని సుమదళాల సౌరభానివా
వీడని మమతల ప్రేమమాలికవా
ఎవరు నీవు నింగిలోని జాబిల్లివా

కలిమి అందించే చంద్రసోదరివా
చెలిమి పంచే ప్రియతమనేస్తానివా
ఎవరు నీవు ఎదసడులరవానివా

చెట్టున చిగురించే చివురువా
అందంగా సమ్మోహనపరచే చిరునగువువా
ఎవరు నీవు రతీపతీసామ్రాజ్య జేగంటవా

నీవు ఎవరు ఎదలో వలపు కలకలం రేగుటకు కారణమేంటి
నవ్వి పోదురు ఇహంలో మనసు మమతా సకలం నీది కాకుంటే
........

No comments: