ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

Photo: నీలాల నింగిలో నిండిన వెండి జాబిల్లి నీవు  
ప్రాయాల పదనిసలలో పుష్పించిన సిరిమల్లి నేను   
అందమైన స్వప్నలోకాలకు  హ్రుదయాకాశం అద్దంపట్టే  
కిరణాల పరదాల మాటున తళుకులీను చంద్రబింబం చూడముచ్చటే  
నేను కట్టిన పట్టుచీర జిలుగులల్లే అవనిపై పున్నమి వెన్నెల విరిసే   

వేవేల వర్ణాలద్దుతున్న పండు వెన్నెల రేతిరిలో  
నెలరాజు వంటి ఱేడు కోరే వన్నెచిన్నెల కోమలి మనసులో  
కన్నె స్వప్నాలను మనసులోని ఆశలని అలజడులని ప్రశ్నలని  
తీర్చి తన కొంగు బంగారమవ్వాలని ప్రార్ధించే ఈశుపత్నిని  
గౌరమ్మా..చెలువమైన పురుషుని వున్నతికి ఇవే నా ప్రార్ధనలమ్మా   

నిండు పున్నమి చందాన నా జీవితమంతా
శోభోయమానంగా హార్ధికంగా వెలుగులతో నిండాలని   
ధరణిపై నా జీవితం ఉజ్వలంగా వెలగాలని మంగళమయమవ్వాలని
ఈ నా మనోకామ్నమ్మును నీ పాదాల చెంతన సమర్పిస్తున్నానమ్మా 
గౌరమ్మా...కులగౌరవం కలిమి బలిమి చెలిమి మా ఇంట నిలపవమ్మా    
.........
విసురజ

నీలాల నింగిలో నిండిన వెండి జాబిల్లి నీవు 

No comments: