మన భారతదేశం గొప్పదనం గురించి చెప్పాలంటే ఎంతైనా తక్కువే. అందులోనూ అతి ప్రాచీనమైన మన భారతదేశ సంస్కృతి సౌరభాలు ఎల్లరను రంజింపచేసాయి, చేస్తూనే వున్నాయి. అందులో భాగమైన సంగీత, సాహిత్య, గాన కౌశలప్రభలు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇక్కడ మరో చూడముచ్చటైన విషయం గమనించాల్సిన విషయం ఏమిటంటే..మతసామరస్యం, సర్వమత పూజనీయత, మతం విషయంలో వ్యక్తిగత స్వేచ్చ ఇవన్నీ మన దేశాన్ని ప్రపంచ పటంలో తలమానికంగా చేస్తాయి. అలాగే సినిమాలు కూడా వీటిని పెంపొందించే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాయి.
ఉదాహారణకు 1952 లో వచ్చిన "బైజూ బావ్ర" సినిమాలో ఈ క్రింది పాటను తీసుకుంటే
"హరి ఓం..మన్ తడ్పత్ హరి దర్శన్ కో ఆజ్" అంటూ సాగే అతి చక్కని పాటని రాసింది 'షకీల్ బదయున్' గారు, మాల్కుస్ రాగంలో సంగీతం కట్టింది 'నౌషాద్' గారు మరి ఈ అద్భుత పాటను పాడింది 'మహ్మద్ రఫీ' గారు ...అంటే రాసింది, సంగీతం చేసింది, పాడింది అందరూ ముసల్మానులే కానీ పాడింది హిందు దేముడైన "హరి" గురించి, అదే మన దేశ సంస్కృతీ గొప్పతనం. ఈ సినిమా "బైజూ బావ్ర" అన్నీ పాటలు ఆణిముత్యాలే.
......
ఇట్లు
మీ
విసురజ

No comments:
Post a Comment