ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కవిత/స్తుతి: శివోహం

ప్రణయానికి ప్రతిరూపానివి నీవేగా శివా
పౌరుషానికి ఆలిఅబ్బనే దునిమేవు దేవా
కన్నప్ప పిచ్సిప్రేమకు పొంగేవు శివా
కిరాతార్జునీయంతో కిరీటికి శివధనశిచ్చేవు దేవా
చండాలుడివై ఆదిశంకరుని తృష్ణతీర్చేవు శివా
చిత్ స్వరూపమై అందరిలో జ్ఞానదీపమయ్యావు దేవా
త్రిపుండ్రాలతో తీరుగున్నావు లింగరూప శివా
త్రిలోకపూజ్యుడివి త్రిపురాంతకుడివి త్రినేత్రస్వరూపి దేవా
విరాగివై వైరాగ్యజ్ఞాన ప్రదాతవయ్యవు శివా
ఆలికి అర్దభాగమిచ్చి పతిశ్రేష్టుడివయ్యావు దేవా
హిమభూమి కైలాసం ఆవాసంగా శివా
రుద్రమైనా రౌద్రమైనా నీకేచెల్లేగా దేవా
ప్రళయానికి శిల్పివి నీవేగా శివ
ప్రకృతి విలయానికి సంతకానివి దేవా
ఆది అంతం నీవేగా శివా
కేరింతా కేకకు కారణం(నీ)మహిమేగా
వాసిలేదు రాసులతోనే రత్నాలంటామా శివా
సత్తులేదు స్తుతిసోత్కర్షయే సొత్తయ్యే దేవా
ముల్లోకాలను ముక్కంటితో పాలించే శివా
భూలోకంలో రెండుకళ్లుంటేనే విర్రవీగేము దేవా
.........
విసురజ

No comments: