ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

కవిత: నీవెవరు చెలి

నీలాలనింగికి సాటియైన
నీ మనసు తెలిసా
ఏమిటో నా మనసు చేసే మాయ 
ఏమేటిమిటోగా అయిపోయేగా
విద్యుల్లతకు సిగ్గిచ్చే
నీ మేనివిరుపు చూసా
ఏమిటో నా పిచ్చిమనసు బాధ
ఏమైందో ఏమిటో నీ వెనకెనకే పడేగా
అరుణకిరణాల పరువుదీసే
నీ మోమెరుపును చూసా
ఏమిటో తెలియని తీయని వ్యధ
ఈ మింగలేని కక్కలేని నీ మాయ
హరివిల్లునే వెలవెలబోయేటట్టుచేసే
నీ రంగులీను నవ్వు చూసా
ఏమిటో నిశ్చేస్ట చేసి నిలబెట్టేసిందిగా
తాళలేకపోతున్న నీ మాయ
నెమలినడకలకే నవ్యరీతులునేర్పే
నీ నయనానందకర లాస్యం చూసా
ఏమిటో అదే చూస్తు వుండిపోవాలనిపించేగా
కట్టిపడేసిందిగా నీ మాయ
ఎవరు నీవు ప్రియే చారుశీలే
సౌధామిని చెల్లెలవా రంభరమణి అమ్మవా
నీదేవూరు చెలి సిరిమల్లి
ఆకాశదేశ రాణివా ఇంద్రసభ అప్సరశవా
కలలో నీవు ఇలలో నేను
కవ్వించే నీవు కలతల్లో నేను
కుదరని మాటయైనా కాదనక
ఒక్కపరి నా ఎదుటపడవా
నిను కనులారా చూసినాక
కనుమూసినా కొరత వుండదుగా
మనసులో వ్యధ వుండదుగా 

No comments: