స్నేహానికి కావాల్సింది
ముఖ్యంగా ఒకరిపైఒకరికి నమ్మకం
మదిలోని భావాలకివ్వాల్సింది
భాష్యంతో దుర్బేధ్యమైన ప్రాకారం
ముఖ్యంగా ఒకరిపైఒకరికి నమ్మకం
మదిలోని భావాలకివ్వాల్సింది
భాష్యంతో దుర్బేధ్యమైన ప్రాకారం
నారీ సుకుమారి
సుచరిత మందస్మిత మూర్తివి జాహ్నవివి
స్వీయమనసుపై అపనమ్మకంతో
నెయ్యంలో అపోహలతో అగాధం తెచ్చేవు
సుచరిత మందస్మిత మూర్తివి జాహ్నవివి
స్వీయమనసుపై అపనమ్మకంతో
నెయ్యంలో అపోహలతో అగాధం తెచ్చేవు
కలిసీ మురిపెంగా మాటాడి
నెయ్యముతో బ్రతుకును రంగరించావు
మాటలే ఆకస్మికంగా ఆచేసి
మౌనాలతో ఎదజ్వాలను రగిలించేవు
నెయ్యముతో బ్రతుకును రంగరించావు
మాటలే ఆకస్మికంగా ఆచేసి
మౌనాలతో ఎదజ్వాలను రగిలించేవు
చిరాకుతో మౌన భాష్యంతో
చెరగని తీవ్రశిక్ష వేసావు
హృదిలో రక్తాశ్రువుల వానతో
ఎడదలో చిచ్చు పెట్టావు
చెరగని తీవ్రశిక్ష వేసావు
హృదిలో రక్తాశ్రువుల వానతో
ఎడదలో చిచ్చు పెట్టావు
చెయ్యని తప్పుకు
వివరణ చెప్పుకునే అవకాశమివ్వలేదు
మనసు మూటను
సంపూర్తిగా విప్పుకునే సౌకర్యమివ్వలేదు
వివరణ చెప్పుకునే అవకాశమివ్వలేదు
మనసు మూటను
సంపూర్తిగా విప్పుకునే సౌకర్యమివ్వలేదు
మదిమాట విననంటావా
ఎదసంతకం చూడనంటావా
మందిమాటే నిజమంటావా
స్నేహమాధుర్యాలే మరుస్తావా
ఎదసంతకం చూడనంటావా
మందిమాటే నిజమంటావా
స్నేహమాధుర్యాలే మరుస్తావా
చేసింది తప్పైతే కోపపడు
కొట్టు తిట్టు బాధపడను నేస్తమా
నేరమే చెప్పక మాటాడక
నాకు శిక్ష వేయడమంటే న్యాయమా
కొట్టు తిట్టు బాధపడను నేస్తమా
నేరమే చెప్పక మాటాడక
నాకు శిక్ష వేయడమంటే న్యాయమా
నేటి మేటి సాటిలేని
సాటిరాని పూబంతి ప్రవల్లిక
తప్పూ ఒప్పూ తెలియకే
తనమనసునే శిక్షించుకునే ఈమల్లికా
.............
సాటిరాని పూబంతి ప్రవల్లిక
తప్పూ ఒప్పూ తెలియకే
తనమనసునే శిక్షించుకునే ఈమల్లికా
.............
విసురజ
No comments:
Post a Comment