ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కవిత: కూసింత తొందర

స్మశాన విహారిపై
విరాగిపై బూడీదీసునిపై
ప్రజాపతిపౌత్రి గౌరికి 
అంతులేని అనురాగం
జనకుడైన దక్షుని
మాటని జవదాటినాయే
సదాశివుని పెళ్ళాడి
కైలాసం తరలిపోయే
దక్షునిచే తలపెట్టిబడిన
క్రతువుకు మహాయజ్ఞానికి ఆహ్వానమే పంపబడని
తండ్రింటికి తయారయ్యే శివసతి

పుట్టింటికీ పిలవని పేరంటానికీ
దక్షయజ్ఞ క్రతువుకి
వెడిలే పార్వతి కూడదన్న
పరమేశు మాటను కాదని
ముక్కంటి పత్నికి
మునిజన సేవిత జాహ్నవికి
పుట్టింటిమీన మమకారం
మరదే తెచ్చేగా అనర్ధం
ఇది నాటి ఒకనాటి పురాణగాధ
యితిహాసపు సిరిమల్లి పార్వతి
నిత్య సత్యవ్రత పవిత్ర
ప్రభందనాయకీ సిరివల్లి ఈశ్వరి
................................ 
విసురజ

No comments: