మేలిముసుగు తొడిగి మబ్బులమ్మ
సాగరునితో రమ్యముగా క్రీడించే
అల నీలి గగనాన నెలవంక
తారలతో దోబూచులాడి వినోదించే
మంచుతెరలచీరతో మల్లెపూలమాలలతో రేయమ్మ
జాబిలికై సింగారించుకుని ఎదురుచూసే
అవనిపై తెల్లని పానుపు
వెన్నెలే పరవంగా జగం మెరిసిపోయే
కలువరేడు రాకతో విచ్చిన
విరులందాలన్నీ భ్రమరాలు ఎంగిలిచేసే
చీకటి దాపులలో చెట్లతోపులలో
వెలుగులును సుందరంగా విరజిమ్మే
సృష్టికి ప్రతిసృష్టిచేయ శాశాంకుడే
అనునిత్యం సర్వులను ప్రేరేపించే
వెన్నలజలతారు వలపువానలలో తడిసీ
ధరణి జనులంతా మురిసిపోయే
..............
విసురజ

No comments:
Post a Comment