ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత:విశిష్ట సినీవ్యక్తిశ్రేష్టులు

వర్చస్సుతో సుందరాకృతితో యన్టీవోడు
నవరస నటనాకౌసల్యంతో మురిపించాడు
జానపద, పౌరాణిక, సాంఘీక పాత్రలతో మెప్పించాడు
నిబద్దతక్రమశిక్షణతో నందమూరివంశజుడు నటరత్నగెదిగాడు
సర్వవేళలా తెలుగుజాతిగౌరవానికై ఎలుగెత్తిచాటాడు
నాజూకులుక్కుల మహాఅందగాడు నాగిగాడు
నటనావైదుష్యంతో సాంఘీకనవలల రారాజైనాడు
వియోగవిషాద అద్భుతచిత్రణలోనూ చిరంజీవైనాడు
స్పష్టభాషాచతురుడు అక్కినేనివంశజుడు నిత్యయవ్వనుడు

కష్టాన్నినమ్మేవాడు నమ్మేదానికై తెగించికష్టపడేవాడు
ఇతిహాసపు కతతో చాణక్య చంద్రగుప్త సినిమానిచిత్రిస్తే
మురపుత్రున్నుంచి యన్టీవోడుని చంద్రగుప్తమౌర్యనిచేసాడు
సినిమాలోచాణక్యుడిగా అద్భుతనటనచూపిన నాగిగాడు
ఇరువురి పోటాపోటీనటనతో సినిమాఅద్భుతంగాపండే
సినిమాచూసిన ఎల్లరిమనసులు ఆనందంతోనిండే
..............

No comments: