ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: ఏకాంతవేళ

తలపులని తహతహలని
తలలో తురిమిన పూలతో చెప్పుకుంటే
ఏకాంతవేళ నీ కాంత ఏమవ్వాలి
వలపులను వాంఛలను
వదనంలోని వెలుగు వాకిళ్ళతో చెప్పుకుంటే
ఏకాంతవేళ నీ కాంత ఏమవ్వాలి
కోరికలను కల్పనలను
కన్నులలోని మెరుపు మురిపాలతో చెప్పుకుంటే
ఏకాంతవేళ నీ కాంత ఏమవ్వాలి
మరులను మమతలను
మోములోని మోహనంతో మురుస్తూ చెప్పుకుంటే ఏకాంతవేళ నీ కాంత ఏమవ్వాలి

బాధలను భవిష్యగాధలను
బుగ్గల్లోని సొట్టలతో స్తుతి చేసుకుంటే
ఏకాంతవేళ నీ కాంత ఏమవ్వాలి
నవ్వులను నవ్యందాలను
నుదురు నునుపుతోను నాజూకుతోను చెప్పుకుంటే
ఏకాంతవేళ నీ కాంత ఏమవ్వాలి
ప్రేమలను ప్రేమపరిమళాలను
పరువాల పరదాలతో పసందుగా చెప్పుకుంటే
ఏకాంతవేళ నీ కాంత ఏమవ్వాలి
మాటైన మనసైన మమతైనా తిన్నగా మనిషితో చెప్పుకో
వ్యధైన మదైనా మనసుగాధైన నీటుగా గుట్టు విప్పుకో
ఏకాంతవేళ నీ కాంత మోములో ఆనందం విరిస్తుంది చూసుకో
........

No comments: