ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: ఆనందపు పంట

మనసే అందాల బృందావనమై మురిస్తే
యమునాతటినే మది ఊగే ఊయల
తలపే సుందర రంగులస్వప్నమై పిలిస్తే
కనులకొలనులో ప్రేమ కాంతి కనిపించే
పలుకే తియ్యని అమృతఫలాలు అందిస్తే
మధువులూరిన మధురమాట అందమే
వానమబ్బు నీడలో మెరుపుమబ్బు చాటులో
ఎదగోడవను మదిఘోషను చెప్పాలని చూసా
చెప్పలేక మదిగుట్టు విప్పలేక మదనపడ్డా
చెప్పకనే మనసుమాట తెలిస్తేనే ప్రేమంటా
.........

No comments: