ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత:అనురాగ వల్లరి

శ్రీనాధుడి చిత్రవిచిత్ర ప్రేమచేష్టలు
శ్రీదేవికి కలిగించెను హర్షము
అత్మీయుని అనురాగపూరిత భావావేశం 
మంజులమై చెప్పకనేచెప్పే మదిభావం
పరుగులుతీసే అల్లరివయసుకు
అతిశయమే అందం
కులుకులోలికే సోకులసొగసుకత్తెకు
అందమిచ్చేలే అతిశయం
ఎదగదిలో రేగెనెన్నో
వద్దన్నా ప్రియతలపుల పిలుపులు
మదితడితో కోరెనెన్నో
కూడదన్నా ప్రేమబాషలో పిచ్చికోరికలు
వలపుబాటలో ప్రేమమామూళ్ళు
కోరకనే పయనించేగా ఎందరో అత్మీయనేస్తాలు

No comments: