ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: ప్రేమందాలు

నిలవలేని నిలకడలేని మనసుతో
మదిలోవున్న నీకై నీరీక్షిస్తున్నా చెలి
గెలవలేనని ఘోషిస్తున్న హృదితో 
గమ్యానివైన నిన్నే గమనిస్తున్నా చెలి
పలకలేని ఊసుతో పడిలేచే
మదికడలి కెరటమే నీవు చెలి
కుదురులేని మాటతో ఎదలోన
ప్రేమెక్కిళ్ళను ఎక్కేసేది నీవే చెలి
నింగిలోని జాబిల్లి వెలుగుని
నేలపైన చెలి మేనిరూపు దాటేగా
తోటలోని గులాబి సోయగాన్ని
అరవిచ్చిన చెలి సొబగు మరిపించేగా
మనసైన మంజరి సిగ్గందాలు
బ్రతుకున చెలి విరబూయించిన వెన్నెలలు
నాజూకైన చిన్నారి సింగారాలు
జీవితాన చెలి చిలకరించిన సుమవానలు

No comments: