ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

మిత్రులారా...ఉషోదయం
1) తప్పు చేయని వారంటూ ఈ ప్రపంచంలో ఎవరుండురూ. తప్పు చేసిన వ్యక్తిని క్షమించగల వ్యక్తిలో మంచితనం వుంటుంది. మరదే తప్పుని, తప్పుచేసిన వ్యక్తి చర్యని మరచిపోయే వ్యక్తిలో గొప్పతనం వుంటుంది.
2) అన్నీ నాకే తెలుసంటూ విర్రవీగేవారికి తెలియాల్సింది ఏమిటంటే ఈ జగాన ఏమి తెలియనివాడు వుండనట్లే అన్నీ తెలిసినవాడు కూడా లేడు. మిడి మిడి జ్ఞానంతో మిడిసిపడే వ్యక్తులకు జ్ఞానపిడి పోటు తప్పక తల బొప్పి కట్టించు.
*****
విసురజ
......
పి.యస్..(చిన్న చిన్న తప్పులప్పుడే మేల్కొనాలి, సరిదిద్దుకోవాలి..ఎందుకంటే చిన్న చిల్లు కూడా పెద్ద ఓడను ముంచేందుకు కారణమవుతుంది)

No comments: