ప్రభాత వేళ నింగిని
అరుణ కిరణం ముద్దాడే కమ్మగా
అరుణ కిరణం ముద్దాడే కమ్మగా
మనసైన వేళ చెలిని
వలపు కిరణం ముద్దాడే తియ్యగా
వలపు కిరణం ముద్దాడే తియ్యగా
తేనే కోరు తుమ్మెద
పూతీవెలపై వాలి మధువు గ్రోలదా
పూతీవెలపై వాలి మధువు గ్రోలదా
నిన్ను కోరు ఎడద
ప్రేమరుగుపై చేరి తపన పడదా
ప్రేమరుగుపై చేరి తపన పడదా
కన్నుల్లోని చెలి రూపం
హృదికిచ్చే తీపి భావం చల్లగా
హృదికిచ్చే తీపి భావం చల్లగా
కోరిన భామ మెచ్చితే
తలపులే మది తలుపులు తెరిచేగా
తలపులే మది తలుపులు తెరిచేగా
కులుకు సోకు అందం
కుందనపు బొమ్మ సాంతం అందదా
కుందనపు బొమ్మ సాంతం అందదా
మనసు లోని ఆత్రుత
ఉరకలు వేసే వయసు తొందరచేయదా
ఉరకలు వేసే వయసు తొందరచేయదా
మహిలో నిన్ను వెతికా
మదిలో నిన్ను కలిసా ఆర్తిగా
..........
మదిలో నిన్ను కలిసా ఆర్తిగా
..........

No comments:
Post a Comment