ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: ప్రేమికుల రోజు/వాలెంటైన్ డే

పరిచయమంటే
ఇరు మనుషుల ప్రధమ కలయక
ఇరు మమతల హెచ్చివేతలూ కూడిక
పలకరింపంటే
రెండుపెదవుల ఆత్మీయ పిలుపు
రెండుహృదయాల స్పందన మెరుపు
స్నేహమంటే 
ఒక అద్భుత అనన్య విషయం 
ఒక అమృత ప్రేరణ పరవశం
ప్రేమంటే
రెండు గుండెలు ఆర్తిగా ఏకమవ్వడం
రెండు తలపులు పూర్తిగా మమేకమవ్వడం
పరిణయమంటే
ఇరువురి వలపు పరిపక్వత చెందడం
ఇరువురి పెద్దలూ ప్రేమకిహారతి పట్టడం
కోరిన పరిచయమే తీయని పలకరింపైతే
మెచ్చిన పలకరింపే స్నేహమాధురులు అందిస్తే
నచ్చిన స్నేహతావిపై ప్రేమభ్రమరమై వాలితే
చేరిన ప్రేమదీపమే పరిణయకాంతులు పంచితే
జీవితాన సఖుని తోడందిన మనసే ఊయల ఊగేనోయి
బ్రతుకున ప్రేయసి తోడుండిన వేరే సుఖాలింకలేలనోయి
లోకాన అట్టి ప్రేమజీవులకు నిత్యం 'వాలెంటైన్' డేలేకదోయి

No comments: