ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

అర్దాంతర చావే సమాధానమా

బిడ్డలుగా ఎదిగి చదివేదో తమని ఉద్దరిస్తారనుకుంటే 
అందమైన జీవితాన్ని ఓపికలేని బిడ్డలే అర్ధాంతరంగా ముగిస్తుంటే 
నిన్నా నేటిపై క్షోభతో కోపంతో ఆక్రోశంతో
రేపుపై ఎక్కడలేని నిరాశతో బాధతో చెదిరిన తలపులతో
అలసిన మనసుతో బలహీన క్షణాన బ్రతుకే బరువనుకుంటే
ఎదలోని మానసిక వేదనే చావుకి పిలుపివ్వమంటుంటే
ఒక్కమారాగి ఆలోచించవా మిత్రమా కన్నతల్లి మోముని తనబాధని
ఒక్కమారాగి యోచించవా దిగాలుపడ్డ మమతని పగిలిన తండ్రి నమ్మకాన్ని విశ్వాసాన్ని
ఒక్కమారు నెమ్మదిగా యోచించరూ మీరు గడపిన మధురక్షణాలను
జీవితంలో మీరు ఆస్వాదించిన ఆత్మీయ అనురాగాల గీతమాలికలను
విశ్వాసం కోల్పోకు మిత్రుమా కష్టపెట్టే పరిస్థితులకు లొంగకు
ఒక ఓటమే బీజమయ్యేగా మిత్రమా మరో గెలుపుకు
చచ్చి సాధించేదేముంది నీవారిని ఏడిపించడం తప్పా
బతికి సాధించు మిత్రమా బాధ్యతగా వ్యవహరించు
సమస్యలన్నీ అధిగమించి ఇక్కడే దివ్యలోకాన్ని సృష్టించు
,,,,,

No comments: