ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

మిత్రులారా...ఉషోదయం
1) శాస్త్రాలు ఏమి ఘోషించిన మనిషి మనుగడలో కులగోత్రాలు కన్నా గుణగుణాలే పెద్దపాత్ర పోషిస్తాయని తెలిసి మెలిగితే ముదావహం.
2) విపరీత పరిస్థితులలోను లక్ష్యంపై మక్కువతో శ్రద్దా, అకుంఠీత దీక్షతో ప్రయత్నం చేస్తే సాధ్యంలేనిదంటూలేదని ఎరుకలవాడైన ఏకలవ్యుడు, వాల్మీకి, అంబేద్కర్, ఇళయరాజ వంటి వారు నిరూపించి మనందరికీ మార్గదర్సుకలయ్యారు
*****
విసురజ
..........
పి.యస్..(మనసు అద్దంపై మకిలిని తొలిగించుకుంటే ఆపై కనబడే చిత్తరవులన్నీ చిత్తముకు అందంగా అగుపించు)

No comments: