మెరిసేగచ్చుపై పాద ప్రతిబింబాన్ని
చూసిన కళ్ళు మురిసాయి
పాదగజ్జె మువ్వల ఊసులను
వినిన చెవులు మురిసాయి
చూసిన కళ్ళు మురిసాయి
పాదగజ్జె మువ్వల ఊసులను
వినిన చెవులు మురిసాయి
తెల్లని పాదాల మెరుపుతో
మదిలో కుదురు తప్పింది
రూపం కానని భంగిమతోఅతివ చిత్తరవు మెరిసింది
మదిలో కుదురు తప్పింది
రూపం కానని భంగిమతోఅతివ చిత్తరవు మెరిసింది
వన్నెల వెన్నెల వెలుగులే
ఎదగిన్నెలో నిండుగా నిండేగా
సొగసు సోకు పర్యాయపదాలే
మరవన్నీ పాదవర్ణనకు తక్కువేలే
ఎదగిన్నెలో నిండుగా నిండేగా
సొగసు సోకు పర్యాయపదాలే
మరవన్నీ పాదవర్ణనకు తక్కువేలే
చూడలేని అందమేదో కానవచ్చే
పలకలేని మువ్వలేవో పలకసాగే
హృదిలోన మమతలసడి వినబడేలే
కవితలోన కొత్తవొరవడి కనబడేలే
పలకలేని మువ్వలేవో పలకసాగే
హృదిలోన మమతలసడి వినబడేలే
కవితలోన కొత్తవొరవడి కనబడేలే

No comments:
Post a Comment