ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

మిత్రులారా...ఉషోదయం
1) స్పష్టంగా కనబడే దురదృష్టమే కొత్తగా అవకాశాలకు జన్మనిచ్చే తండ్రి వంటిదని తెలియండి. తెగిపోయిన బంధంపై గానీ, పోయిన విషయంపై గానీ విడవడిన దానిపై గానీ చింతిస్తే..ముందర బ్రతుకులోని మెరుపుని గుర్తించడం జరగదు.
2) గెలవడం అన్నివేళలా జయం అనిపించుకోదు. అదేవిధంగా ఓటమి అన్నది అన్నివేళలా అపజయం కాదు. రెండవ ప్రపంచ యుద్డంలోడిన జర్మనీ, జపాన్, సింగపూర్ నేడు సుసంపన్నమైన బలమైన శక్తులు. దిగులు విడిచి నవ రాష్ట్ర నిర్మాణానికై నడుం కడదాం..
*****
విసురజ
..........
పి.యస్..(అర్హతలేని వారిని పొగడడం గాడిదకు సిల్క్ జీను తొడగడం లాంటిది.. అది శుద్ధ అవివేకపు పనిగా తెలియండి)

No comments: