ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

కవిత:మనసు రోదన

నాలో ఆలోచనల నిర్వేదమే 
నన్ను అలింగనం చేసుకున్నవేళ
నాన్నా నీ అనుభవాల సారధ్యమే
నా అలోచనారాహిత్యాన్ని ఆదుకునేగా
పుట్టిన కాలమానస్థితిగతులలో పెరిగిన వాతావరణంలో
జనకుడిమాటే జానకీరాముడి మాటై వెలుగొందినవేళ
ఇష్టమైన చదువేమిటో చదువు కష్టమేమిటో
ఎదమాట ఎదుటపడి చెప్పడమే గగనమైనవేళ
తండ్రిలా కాక స్నేహితుడిలా ఆదరించేవు
పసిమనసిష్టాలను పెరిగేవయసు కష్టాలను తెలుసుకున్నవు
తెలియని విషయాలేన్నొ విశేషముగా బోధించేవు
అన్నీనేర్పి ఎదిగినవేళా నీకు వూతమవ్వేవేళ
సెలవీయకనే మాకందరాని లోకాలకు వెళ్ళిపొయ్యేవు
నాన్నా నీతో కటిఫ్ నీతో పచ్చి అందామన్నా నువ్వంటే పిచ్చే
నన్ను నాన్న కన్నా అంటూ దగ్గరకు తీసుకునేదెవరు
నాన్న నీకై నిత్య రోధించే అమ్మను ఊరడించేదెవరు
నీ తలంపులేక మదివీధిలో తెల్లవారదే
నీకై కన్నీరించక నీ లోటు తెలియక తెల్లవారదే
నీకిష్టమైన అరటిపండు చూసినా
నేతిబీరకాయతో నోరూరించే కూరచేసినా
నీతో సరదాగా చీట్లపేక అడ్డాట అడివోడిన
నాటి నీ విజయగర్వపు చిహ్నాలను తలచినా
కనుకొనలవెంట నీరాగదు మనములో నీ స్మరణాగదు
సెలవందకనే ఏ దేవతలను అలరింప ఏగితివయ్యా
ఇలలో నీ పదచిహ్నపుముద్రలనే నిత్యం పూజిస్తునామయ్యా
వీలైతే ఒక్కపరి వచ్చిపోవయ్యా మాకు కలలోనైనా
అట్టాయితే మాత్రుశ్రీని ఆ విషయంచెప్పి ఊరడించవచ్చేమోనయ్యా
ఏమైనా ఏడున్నా సదా నీ దీవెనలు మాకందించు
మనశ్శాంతి అందేలా రుజుమార్గంలో పయనించేల మాకు ధైర్యమందించు 

No comments: