ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday 29 October 2014

కవిత: ఉగాది

తెలుగు 'జయ' నామ నూతనవత్సర ఆగమన శుభవేళవచ్చే 
కొత్త ఉషస్సుతో ఉగాది అరుదించే మంచిరోజుల మారాకు వేసే
తీపి వగరు పులుపు యిత్యాదివన్నీ కలగలసి ఉగాదిపచ్చడయ్యె
తెలుగుతేజపు ప్రభలు దిశదెసల నలుదిశల ప్రభవించే
చివురులు తొడిగిన తరువులు చిరునవ్వులు చిందించే
తొడిమలు విడిన పూబాలలు సుగంధాలతో సుశోభించే
మంచమ్మ ముద్దాడిన ఆకులు దరికిచేరినవారిపై పన్నీటిజల్లు కురిపించే
వనరాజు చేబట్టిన హరితమ్మ సోగసుహోయలు మురిపించే 

కోనరాజు ఆస్థానవిద్వాంసులు రాచిలకకోకిలలు రాగాలాలపించే
వాసంతయామిని వయ్యారనడకల కులుకులు ఎదలో గ్రీష్మరుచి చూపించే
చెరుకువిల్లెక్కుపెట్టి మదనకామరాజు మహిలో మదిలో ప్రేమరుచి చూపించే
నులివెచ్చని ప్రత్యూషకిరణాలు లేచిగుళ్ళపై తారాడే తుషారబింధువులను చూపించే
పంచాంగ శ్రవణంతో పంచెకట్టిన దార్సినికుడు రాబోయే కాలాలమహిమల్ని వివరించే లాభనష్టాల బేరీజులు అవమానరాజపూజ్య భోజ్యములు నక్షత్రలక్షణాల్ని వివరించే పరువుప్రాపకాలు పదవిగండాలు ఉద్యోగవ్యవసాయ గెలుపోటములతీరు సవివిరంగా వివరించే
తెలుగు జాతికి తెలుగు రాష్ట్రాలకు తెలుగు మడుసలెల్లరకు
నా ఈ కవనమే జయహోజయహో 'జయ' ఉగాదని జోరుగా నినదించే 

No comments: