ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday 31 October 2014

కవిత: సత్యదూరంకాదుగా

నీలాల నింగిని కరిమబ్బే కమ్మేస్తే 
వసుధతాపం వర్షిని తపనతీరేల తీర్చేగా
ఎండావానల సంగమమే ధరిత్రిని పలకరిస్తే 
మింటిలో సప్తవర్ణాల హరివిల్లు పూసేగా
రంగురంగుల సీతాకోకమ్మలు ఝుమ్మని సాగితే 
తరువులకు పూబాలలకు కమ్మనిసంగీతం వినిపించేగా
ప్రేమమబ్బు మదిని మనోహరంగా చుట్టేస్తే 
తపనలు తహతహలు ఎడదను తొందరచేసేగా
మనసైన తీపిగురుతులు ఆహ్లాదవేళ జ్ఞప్తికొస్తుంటే 
ఎదలో సంతోషాల కోలాటం మొదలవ్వేగా
సందెపొద్దులో మరుమల్లియ ముచ్చటగా విరిస్తే 
వలపురాణి సిగనుచేర ఆతృతగా తపనపడేగా
చెలిచామంతే మరులకళ్ళతో మత్తుగా పిలిస్తే 
మగనిగుండెల్లో మదనుడిబాణం వలపుసెగలకు ఆజ్యంపోసేగా 
..............

No comments: