ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: ఏమి చేసేది నేనేమి చేసిది

ప్రాయమే చెలి మేనిసిరులకు
కొత్తందాలద్ది అల్లరిగా పలుకరిస్తే
మూగమనసు తడిమే తలపులే 
చెలి పిలుపుల వివరమందిస్తే
వేధించే వయసుకు ఏమి చెప్పేది నేనేమి చేసేది
తొలివలపుల గుభాళించే సౌరభాలే
మల్లెతోటలలోని పరిమళాలకు పోటీపడితే
చెలిస్నేహపు ఆత్మీయ పలుకులే
మల్లెల లాలిత్యాలకు పోటీకొస్తే
వేధించే వయసుకు ఏమి చెప్పేది నేనేమి చేసిది
మదిలోన స్థిరపడిన మరులే
కళ్ళలోన నింపుకున్న చెలివెలుగులే
పొందికైన జవరాలి అందాలవివరణ
పదేపదేకోరి తరుముతూ తొందరచేస్తుంటే
వేధించే వయసుకు ఏమి చెప్పేది నేనేమి చేసిది
............ 

No comments: