పిల్లగాలి చిలిపి కనుసైగల పలకరింపుతో
తరువునున్న వయసుకొచ్చిన పూబాలలు సిగ్గుపడే
పూబాలల నునుపు మెరుపులు చూసి
ప్రేమపూల పిలుపు పలుకులును తలచి
ప్రేమతృష్ణతో పూలపై తుమ్మెదలు లంఘించే
తరువునున్న వయసుకొచ్చిన పూబాలలు సిగ్గుపడే
పూబాలల నునుపు మెరుపులు చూసి
ప్రేమపూల పిలుపు పలుకులును తలచి
ప్రేమతృష్ణతో పూలపై తుమ్మెదలు లంఘించే
విరగకాచిన విరుల వయ్యారాలను చూసి
పూతేనియలకై పానముకై ఆత్రముతో త్వరపడిన
వడివడి నడకల తుమ్మెదల దాడితో
విరుల మోము సిగ్గుబుగ్గలు ఎర్రబడే
తేనేధారలకై భ్రమరాలు పూలకడకు పరుగులెత్తే
విరులందాల ఆనందాలకై భ్రమరాలు పరుగిడే
పూతేనియలకై పానముకై ఆత్రముతో త్వరపడిన
వడివడి నడకల తుమ్మెదల దాడితో
విరుల మోము సిగ్గుబుగ్గలు ఎర్రబడే
తేనేధారలకై భ్రమరాలు పూలకడకు పరుగులెత్తే
విరులందాల ఆనందాలకై భ్రమరాలు పరుగిడే
ఎంగిలిపడిన పూభామలను ఏరికోరెంచి కొమ్మలను మెల్లిగా వంచి
తరువుల నుంచి తుంచి
పూబాలలను లాలిత్యంగా సేకరించి
ఈ పూలను దండలుగా గుచ్చి
అందించనా గుడిలోని వరాలిచ్చే వేల్పులకు పూమాలలుగా
తీర్చుకోనా గుండెలోని పూలపై ప్రేమను మనసారా
తరువుల నుంచి తుంచి
పూబాలలను లాలిత్యంగా సేకరించి
ఈ పూలను దండలుగా గుచ్చి
అందించనా గుడిలోని వరాలిచ్చే వేల్పులకు పూమాలలుగా
తీర్చుకోనా గుండెలోని పూలపై ప్రేమను మనసారా

No comments:
Post a Comment