ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కవిత: వేగిరా (ప్రేమపిలుపు)


నిండు పున్నమిన వేవేల
వన్నెల కలలు కంటిమే
వలపుల వెన్నెల వీవెనలు
పలుమార్లు తీయంగా వీచినే
ఆత్మీయ పవనాల తాకిడికి
మది హృది పులకరించదా
మనస్విని తోడును కోరుకోనదా
మనసు తెలిపే వేళాయానే
ప్రేమతరంగాల వసంతాల కడలివై తరలిరా
మాఘమాసపు మల్లెల సుమవానవై తరలిరా
భ్రమరనాదాల ఝుంఝుంకారాల గీతమై తరలిరా
డమరువాదాల ఓంకారశబ్దాల శుభమోతవై తరలిరా
వేగరావే మనసైన శ్రీవల్లి
పోబోకుమా ఎడదను గిల్లి
చలి చంపేవేళ పోతావేమి ఇట్లా నన్నొదిలి
రావే మదిబాల సుకుమారి మనోహరి వడివడి
..............
విసురజ

No comments: