ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

కవిత:వలపెఫేక్ట్

వెన్నముద్ద పూలు అరవిచ్చి పిల్చే
ప్రేమను ప్రేమారా
వెన్నదొంగ పొన్నపూల గుత్తులిచ్చి
రాధ మనసు దోచేగా
ప్రియమైన శాంతి చిరునగువే
హృదయభారాన్ని దించేగా
సువాసినిచ్చు పూవులన్నీ కమ్మని మత్తిచ్చే
తేనే త్రాగి జోగిన భ్రమరానికి
నీ తలపులన్నీ తీయని బాధిచ్చే
వలపూభిలో చిక్కుకున్న ప్రేమ బాధితునికి
సుదూరతీరాలలో నీవు నిలుచున్నావు
హృదయసీమలో నిన్ను నిలిపుంచాను
మరైనా ప్రేమించే ఈ ప్రేమకు సిగ్గెందుకో
భవభంధాలలో నీవు మునిగున్నావు
ఉద్యోగభారాలలో నేను నలిగున్నాను
ఏమైనా తడబాటు తహతహలాడే ప్రాణికి హాయెందుకో ...

No comments: