ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: అమరిన అన్యోన్యం

ఋతువులు కళలెన్ని చూపినా
వాసంతమే కృష్ణ ప్రియసేవికగా
వలపులు ఎన్నివర్ణాలలో విరిసినా
రమణిరాధే నిజమైన ప్రేమపూజారిగా
ప్రకృతందాలు ఎంత బాగున్నా సందెమ్మకు రేయినే పసందైనప్రసాదంగా

రాగభావాలు ప్రేమతో మరీమరీపలకరించినా
కల్యాణిరాగం మీటబడేది దినకరునికేగా
ప్రభాతాలు నిత్యంపలకరించేది నింగినే
ఉషారాణమ్మ పరవశించేది కృష్ణప్రాంగణంలోనేగా
సిరిగిరులు ఎన్ని సొంతమైనా
శ్రీలక్ష్మికి జగన్నాధుడే పెన్నిధిగా
.........

No comments: