ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత: కటకటా ఇట్లుండ తగునే

పలుపనుల్ చేయించి టీవీ ప్రోగ్రాంస్ చూసి అలసి
శయ్యగారం జేరి పక్కపైబడి నిద్రోవ కనుల్ మూసి
ప్రియసతిన్ చేరి ప్రీతిమీర సరాగమాడబోవు పతిన్ జూసి 
అకటా కటకటా భార్యకష్తంబుల్ కానవే పెనిమిటికిన్ నని సతిరమణి వాపోయే
క్రీగంట చూడంగనే కొంగట్టు తిరుగాడే పతిన్ చూసి మురిసే
కాస్తనవ్వంగానే మోమును మాతాబులా వెలిగించే పతిన్ చూసి మిడిసే
తననొదిలి మరి పక్కనెక్కంగానే నిద్రాదేవిని వరించే పతిన్ చూసి వగచే
అకటా కటకటా భార్యమనోరధంబుల్ పట్టవే పెనిమిటికిన్ నని సతిరమణి వాపోయే
ప్రక్కింటోళ్ళ పిల్లాతల్లుల పట్ల అలవిలేని అనురాగం కూరిమి చూపంగా
ఇంట్లోవాళ్ళ పొడగిట్టక తిరుగాడు జనులరీతిన్ తప్పు తప్పని చెప్పంగా 
వెలకట్టలేని సమయాన్ని పరులమెప్పుకై శ్రమపడేవారి తత్వమే వింతవ్వంగా 
అకట కటకటా భార్యవిధేయుండనుంచు పెనిమిటిన్ చేయతగునే నిట్టిపనుల్ నని సతిరమణి వాపోయే
కోరి సరసమాడువేళ అతిగా బిగుసుకుపోవుట బిడియపడుట తగునే
ఇంట పిల్లలుండువేళ చెంతచేరి సరసమాడుట సల్లాపాలాడుట తగుదునే
చెంతండు ఏకాంతవేళ దరికిరాకుండ ఆఫీసుపనంటనుచు కంప్యుటర్ ముందుండుట శ్రేయమే
అకటా కటకటా భార్యకాలిమువ్వల సైగ తెలియని పెనిమిటితో కాపురమెట్లోనని సతిరమణి వాపోయే
............

No comments: