ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

కవిత:మనసు కధ ఏమిటో

నిదుర కళ్ళతో పొద్దును చూసా
నీవు కానరాలేదు మనసా నీ అలికిడి తెలియలేదు
బెదురు చూపుతో సందెమ్మను చూసా
నీవు కానరాలేదు మనసా నీ పిలుపు అందలేదు
దీటైన రీతిలో జగతిని వెతికా
నీవు కానరాలేదు మనసా నీ ఉనికి తెలియలేదు
మేటైన బాటలో మహిలో తిరిగా
నీవు కానరాలేదు మనసా నీ మజిలి తెలియలెదు
ఓ మనసులోని మనసా మనసైన మనసా
అర్రే మంచి మనసుకు నీవవుదువుగా సదా కట్టుబానిసా
ఓ మనసులోని మనసా సమస్యవ్వేవు తెలుసా
అర్రే మంచి పలకరింపుకే మనసిచ్చానంటే అసలుకే తంటాగా
ఓ మనసులోని మనసా అస్సలుచెయ్యకు రభస
అర్రే మంచి ముత్యమ్ము దొరికేది ముసి వున్న ఆల్చిప్పలోనేగా
ఓ మనసులోని మనసా వెర్రితనమోద్దే వయసా
అర్రే మంచి మమతను పూర్తిగా అందాలంటే ఆత్రంకూడదుగా

No comments: