తొలినాటి కలలన్నీ తెరలుతెరలుగా
కనుల ముందు నిలబడగా
మదిలోని భావాలాన్ని బలపడగా
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు

ఆలివై వచ్చేవు ఆత్మనలరించేవు
వెన్నెలై విచ్చేవు బతుకమాసలో
మేఘమై వచ్చేవు దాహార్తిగొంతుకు
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
వెన్నెలై విచ్చేవు బతుకమాసలో
మేఘమై వచ్చేవు దాహార్తిగొంతుకు
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
మమతై కలిసేవు జీవనయానంలో
స్వప్నమై నిలిచేవు నాకనుదోయిలో
పుష్పమై విరిసేవు మనసుతోటలో
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
స్వప్నమై నిలిచేవు నాకనుదోయిలో
పుష్పమై విరిసేవు మనసుతోటలో
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
ఏకాంత వేళ ప్రేయసివై అమరసౌఖ్యాలు పంచేవు..
వైఫల్యాల వేళ అమ్మవై లాలించి ఊరడించేవు..
ధర్మాలాచరించువేళ సహధర్మచారిణివై తోడుగా నిలిచేవు
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
వైఫల్యాల వేళ అమ్మవై లాలించి ఊరడించేవు..
ధర్మాలాచరించువేళ సహధర్మచారిణివై తోడుగా నిలిచేవు
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
శ్రీమతవి నీవు నాకు బహుమతివి
అర్ధమే చెప్పేవు బ్రతుకుఆరాటంలో
స్నేహమే నేర్పేవు జీవితపోరాటంలో
వెలుగే పంచేవు చీకట్లద్దినదారిలో
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
స్నేహమే నేర్పేవు జీవితపోరాటంలో
వెలుగే పంచేవు చీకట్లద్దినదారిలో
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
అలసిననాడు ఊతగా నిలిచేవు
ఒంటరైననాడు తోడునీడగా వున్నావు
దెబ్బతగిలినాడు లేపనంగా అమిరేవు

మనసే పరిమళంకోర మల్లెపూల నెత్తావయ్యావు
తోటమాలివై ఇంటి/ఇంతిపూలను(పిల్లలను)సాకావు
వలపుతోటలో ఎడదను విహరింపచేసేవు
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
తోటమాలివై ఇంటి/ఇంతిపూలను(పిల్లలను)సాకావు
వలపుతోటలో ఎడదను విహరింపచేసేవు
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
మనసుకోటలో ఆప్యాయతను పుష్పింపచేసేవు
డస్సినడెందంకు ఊరటనిచ్చే చల్లగాలివయ్యావు
జీవిత బృందావనంలో నీవు నాకై పూచినకొమ్మవు
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
డస్సినడెందంకు ఊరటనిచ్చే చల్లగాలివయ్యావు
జీవిత బృందావనంలో నీవు నాకై పూచినకొమ్మవు
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
ఆకాశం నుండి నాకోసమే దిగివచ్చిన దేవతవి
దేముడు అందించిన అపురూప పుణ్యఫలానివి
నీకేమని తెలిపేది నీదే ఈ బ్రతుకని నీకెలా తెలిపేది
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు
దేముడు అందించిన అపురూప పుణ్యఫలానివి
నీకేమని తెలిపేది నీదే ఈ బ్రతుకని నీకెలా తెలిపేది
ఎదురుగా వచ్చేవు శ్రీమతివై ననుచేర దేవి నీవు
ఎదలోన నిలిచేవు మదిరాజ్ఞివై ననుచేరి దేవి నీవు

No comments:
Post a Comment