ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

విసురజ ఫ్రం ఢిల్లీ (ఆన్ టూర్ అఫ్ ఆంధ్ర)
c/o bhavajhari.blogspot.in
మిత్రులారా....ఉషోదయం
సంవత్సరం: విజయ నామ సంవత్సరం
ఋతువు: శశిర రుతువు
మాసం: మాఘమాసం
పక్షం: శుక్లపక్షం
ఉత్తరాయణం
నేటి రోజు: ఆదివారం
నేటి తారీఖు: 02 ఫిబ్రవరి, 2014
నేటి తిధి: తదియ నిన్న రాత్రి 7.55 నిమిషాల నుంచి నేటిరోజు రాత్రి 09.41 నిమిషాల వరకు తదుపరి చవితి
నేటి నక్షత్రం: శతభిషం నిన్న ఉదయం 10.25 నిమిషాల నుంచి నేటి మధ్యాహ్నం 12.16 నిమిషాల వరకు తదుపరి పూర్వాభాద్ర
...........
1) ఉన్నతమైన స్థానాల్లో వున్నవారు వున్నంతంగా ఆలోచిస్తే సమాజ హితానికి తోడ్పడినవారవుతారు. అలా కాకుండైతే వారు స్వహితంతో పాటు సమాజ బాధ్యతకు హానీ కలిగించినవారవుతారు.
2) కలత చెందిన మనసుకు ఊరట కలిగించేది సిరులు సంపదలు కావు, ఒక చల్లని మాట, నేనున్నాననే భరోసా మరియు సదరు వ్యక్తి శక్తియుక్తులపై మనం చూపించే నమ్మకం. వీటి తోడుతో ఎటువంటి బాధాసాగారాన్నైనా దాటవచ్చు.
..........
విసురజ
..........
పి.యస్: (అడక్క సలహాలిస్తే అలుసవుతారు, అలోచించి మెలగండి, మీ వేల్యూని పెంచుకోండి)

No comments: