ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

1) లక్ష్యం లేని జీవితం ఎడ్రెస్స్ లేని ఉత్తరం లాంటిది. మరలాగే లక్ష్యం వుండి ఎంచుకున్న లక్ష్యం వైపు తగు క్రుషితో తత్పరతతో క్రియలను చేపట్టకపోతే..ఎడ్రెస్స్ వుండీ కూడా సదరు ఉత్తరాన్ని పోస్ట్ చెయ్యకపోవడంతో సమానమవుతుంది. తెలుసుకో తెలివిగా మసులుకో.
2) మ్రోగించబడని గంట శబ్దం తెలియరాదు, కట్టిన పాట ట్యూను తీరుతెన్నులు ఎవరైనా పాడకపోతే తెలియరాదు..అలగే మనసులోని భావాలను చెప్పక దాస్తే వినవలసినవాళ్ళకి తెలియరాదు..భావాలను చెప్పుకో స్నేహహస్తాన్ని అందుకో.
3) నీ కష్టాన్ని మరోకరు అందలేరు, నీ అనందాన్ని మరోకరు పొందలేరు..అనందాలను మరోకరు నీ దోసిట్లో తెచ్చి పోస్తారని భావిస్తే అంతకన్నా వెర్రితనం మరోటి వుండదు. నీ ఇంటి పెరటి చెట్టుకు నువ్వు నీరు పెట్టందే మరోకరు పెడతారనుకుంటే అది భ్రమే అవుతుంది..మేలుకో మంచిగా ఎదిగిపో.

No comments: