1) తూలనాడినపుడు తుళ్ళిపడకుండా, పొగిడినపుడు పొంగిపోకుండా... సర్వావస్థల్లోనూ సమానత్వం చూపగలిగిననాడు..ధైవత్వముకై వేరెక్కడనో వెతకక్కరలేదు, తమలోనే దర్శించుకోవచ్చు...
2) కష్టాల్లోనే తమ వారెవరో, పరాయెవరో తెలిసొస్తుంది...కష్టపడి అలిస్తేనే శ్రమశక్తి విలువ తెలుస్తుంది..పడిలేచినపుడే కెరటానికైనా/మనిషికైనా గమ్యం చేరికలో తెలుస్తుంది..
3) గడుస్తున్న కాలం విలువ గడిచి గతమయ్యేదాక ఒక గుర్తుగా మిగిలేదాక సాధారణంగా తెలియదు..వ్యర్ధంగా కాలయాపన సేయక కాలాన్ని లాభసాటిగా గతమవ్వక ముందే గుర్తెరిగి మెలుగు, జీవితంలో ఎదుగు, వెలుగు...
No comments:
Post a Comment