ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

కవిత: శ్రీ హస్తిముఖుని స్తుతి

వక్రతుండా వరదాయకా ప్రణతు ప్రణతు 
ఏకదంతా భక్తహృదయా ప్రణతు ప్రణతు
కృష్ణపింగాక్షా కృపానాధా ప్రణతు ప్రణతు
గజవక్త్రా మందగమనా ప్రణతు ప్రణతు
లంభోదరా లోకపాలకా ప్రణతు ప్రణతు
వికటనాశాయ ఆర్తజనపాలకా ప్రణతు ప్రణతు
విఘ్నరాజ ప్రధమపూజార్హీ ప్రణతు ప్రణతు
ధూమ్రవర్ణా దూరాలోచనకారి ప్రణతు ప్రణతు
ఫలాలిచ్చే ఫాలచంద్ర ప్రణతు ప్రణతువరాలిచ్చే వినాయకా ప్రణతు ప్రణతు

గణాలకధినాయాకా గణపతిదేవా ప్రణతు ప్రణతు
బుద్దిసిద్దిప్రాణేశ్వరా గజాననా ప్రణతు ప్రణతు
చతుర్విధఫలదాయకా ఉచ్చిష్ఠమహాత్మా హస్తిముఖా
మూషిక వాహనా భక్తసులభా గౌరిపుత్రా కావవయ్యా
నిత్యమీ భజనను మూడుపూట్లా ఎవ్వరూ చదవునేని
వారి వెతలనూ పరిమార్చి సంతోషాలను అందించి
నిక్కముగా అవ్వారి కోరికలు తీరి కొంగు బంగారమావ్వాలి
సదా ఓ పార్వతీతనుయా నీ కృపాకటాక్షం లభించాలి
నీపై నమ్మికతో ప్రమధనాధా సర్వులకూ చెప్పుచుంటి
ఈ విసురజ మాట సంతోషాలొసుగు అక్షయపైడిమూట

No comments: