ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

1) జీవితంలో మంచి మనుషులతో సావాసం ఆవశ్యకత మరియు విశిష్టత ప్రతిజీవిలోని వినబడడమే తప్ప కనపడని గుండె చప్పుడు లాంటిది..అటువంటి వారు ఎదురుపడకపోయినా, కనబడకపోయినా నిశ్శబ్దముగా తమ పవిత్ర విధిని నిర్వహిస్తుంటారు..
2) మనిషి తన బ్రతుకులో గెలవాలంటే, తన గెలుపుకు దోహదపడే బలమైన నిర్ణయాలైనా తీసుకోవాలి లేకపోతే తీసుకున్న ఏ నిర్ణయానికి సంపూర్ణ బలమైనా జోడించాలి..
3)గతంలోని విజయాల లేక వైఫల్యాల విలువ నేడు ప్రామాణికంగా నిలవదు. నీ అత్యుత్తమ ప్రదర్శన నేటిరోజు అందివ్వు..ఎల్లరు నిన్నటి వార్తాపత్రిక కాక నేటిరోజుటి వార్తాపత్రికే చదవడానికి మక్కువపడతారు..అందుకే నేటిలో బ్రతుకు మేటిగా బ్రతుకు..

No comments: