ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

కవిత:చినుకు పిలుపు

డస్సిన నేలతల్లి పిలుపుతో
నీలిమబ్బు బిరబిరా రావచ్చే
మేనుని చల్లగాలి తాకుతుంటే 
మేఘరాజు జరజరా వర్షించే
నింగినుంచి జాలువారు జల్లులే
మనస్వినిని తాకి పరవశింప
కాపుగాడు వాటిని తాకనియ్యక
చిరుజల్లులను అరిటాకుతో ఆపేలే
వానచినుకు రాకతో
గొంతెండిన నేలతల్లి దాహార్తి తీరే
చిరుజల్లులతో పచ్చదనాలతో
ప్రకృతి హరితవర్ణ పావడ కట్టే
దాన్నిచూసి రమణిలలామ
మోములోని కళ్ళు ఆనందంతో విప్పారే
విప్పారిన సురమ్య
కనుబొమలముడిని చూస్తే సుమధనువు గుర్తొచ్చే
అత్మీయసుందరి ప్రేమనాదనగా
మదీయ మానసంలో అలవిలేని మమతావేశం కల్గే

No comments: