ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

1) రోషాల వేళలలో కోప ప్రకోపాలలో గబుక్కున చేష్టలు చేస్తే దోషాలు దోర్లుట ఖాయం. వేడి కుంపటి ముట్టుకుంటే చెయ్యి కాలదూ..
2) మనసు నిర్మలంగా వున్నప్పుడు పెద్ద తప్పులూ సిన్నవిగా..ఛస్..ఇంతేగా అనిపించు..అదే మనసు అల్లకల్లోలంగా వున్నప్పుడు బుజ్జి/చిన్నచిన్న తప్పులూ సానా పెద్దవిగా..ఛస్..నమ్మితే ఇంతగానా అనిపించు..ఇది జరిగిన తప్పు ఫలం కాదు..చూసే సమయంలోని ఊసులాడే మనసు మహిమ..
3) కలుగులోనిది బయటకు రావాలంటే పొగ సెగ పెట్టాలి. మనసు పొరల్లోనిది బయటకు రావాలంటే బాధ/వ్యధ సెగ తగలాలి.

No comments: