1) జీవితమంతా నవ్వులతో విలసిల్లాలనుకవడం కలలలోకంలో విహరించడం లాంటిది..కష్టాలరహిత జీవనం, కెరటాలరహిత కడలి, భావాలరహిత మనసు అస్సలుండడమనేది మిధ్య..
2) జీవితం నెరిపేటప్పుడు అందునా సుఖాల వెంబడి పరుగిడే పరంపరలో మన ఉనికిని, నమ్మకాన్ని, ఔన్నత్యాన్ని, అంతఃకరణంలో దాగుండు ఆత్మానందాన్ని శిలువవేయకుండా కాపుడుకుందాం..అప్పుడే మనం నిజంగా దైవికమైన ఆత్మీయసౌఖ్యాన్ని అందగలుగుతాం..
3) మోహం లేక వ్యామోహం పుట్టదు..చింత లేక చింతన పుట్టదు..అతిభోగలాలసత్వం లేక వైరాగ్యం పుట్టదు..
...........
...........
No comments:
Post a Comment