ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

కవిత: రోదనలో వేదన

విలపించే మనసు
నీవు రాలేదని పిలుపు వినరాలేదని
కఠిన శిలవైతివేమని కరుణ చూపనైతివేమని
ప్రేమంతా మాటలలోనే క్రియలేమో శూన్యమాయనే
వినరావా ననుచేరగ త్వరితగతి అరుదెంచవా
ప్రేమలే పండంగా అనందాలసీమలో విహరిద్దాములే
ఏడ్చే పూసొగసు
తుమ్మెద రాలేదని తనని తాకలేదని
పలకరించక పైన వాలక మరలిపోయిందని
ఈ కన్నెకలువ వన్నె నచ్చకనా లేక మరో పూబాలా సవితిగా దొరికిందనా
మరులుగొన్న మమతల నీ పూరాణిని వదిలి
ఆడీడ తిరుగాడుట భావ్యమా అనురాగాన్ని అపహాస్యము చెయ్యటమేగా
రోదించే యువఫోర్సు 
ఛాన్సు రాలేదని ఒక్కఛాన్సూ అందిరాలేదని
భవిత అంధకారమయ్యిందేమని బ్రతుకు బరువయ్యిందేమని
కనిపెంచిన కన్నవాళ్ళ ఆశలకలలు ఆవిరయ్యాయని 
అయినా రేపుపై ఆశతో అలవిలేని కష్టాలకు 
జవాబిచ్చే తీరుగా ఎదుగుతామనే నమ్మకాన్ని శ్వాసిస్తూ 

No comments: