నిన్న రాత్రి మలేషియన్ విమానం కూల్చివేత..ముష్కరుల దుశ్చర్య..అమాయకమైన 295 ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం..అన్నిటికీ మించి దుర్బాగ్యం ఏమిటంటే.. ఉకరైన్ ప్రభుత్వ దళాలు తీవ్రవాదులని.. తీవ్రవాదులు ఉకరైన్ ప్రభుత్వాన్ని ఈ ఘటనకు కారణమని దుమ్మెత్తిపోయడం..కుర్సీకై కుమ్ములాట..పవర్ పట్ల పిపాస..మతోన్మాద ఘంటారావాలు..
2) కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం..ఆంద్ర రాష్ట్రాలు..చదువుకునే పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకోవడం..ఇంకా ఇంజనీరింగ్/మెడిసిన్ అడ్మిషన్ పట్ల స్పష్టత లేకపోవడం...పైగా ఇద్దరు ముఖ్యమంత్రులు/సంబంధిత మంత్రులు/ఇరు రాష్ట్రాల పెద్దమనుషులు కూర్చుని తీల్చుకోవాల్సిన విషయాన్ని కోర్టుల దాకా తీసుకెళ్లడం/సాగదీయడం.. నేతలు నష్టపోరు..నష్టపోయేది యువత.. వీళ్ళ పదగర్జనలతో.. యువతకు తమ శక్తిపై అవిశ్వాసం..వాళ్ళ అప్యాయతల్లో, మమతల్లో విద్వేషాలు రగిలించడం..
No comments:
Post a Comment