అనురాగమూర్తి ఆత్మీయ పలకరింపు
మధురభావనల పన్నీటి చిలకరింపు
మధురభావనల పన్నీటి చిలకరింపు
ఆత్మీయతావాణి తీయని తలుపు
మధురూహలిచ్చే చల్లని పిలుపు
మధురూహలిచ్చే చల్లని పిలుపు
వయసుతో నిమిత్తమదేమి
ఆప్యాయత అభిమానాల కలలకలబోతకు
ఆప్యాయత అభిమానాల కలలకలబోతకు
నింగితో నిమిత్తమదేమి
తారల మిణుకుప్రభలు వెల్లివిరియడానికి
తారల మిణుకుప్రభలు వెల్లివిరియడానికి
చీకటితో నిమిత్తమదేమి
జాబిలి సోయగాలు ఆరబోయడానికి
జాబిలి సోయగాలు ఆరబోయడానికి
వెలుగుతో నిమిత్తమదేమి నెచ్చెలి నగుమోము మెరవడానికి
నెయ్యములోని తీపిరుచులు
హృదయంలోని తీపితలపులు
సరసాల సౌఖ్యాల ఆనందాల ఊయలలూగే
హృదయంలోని తీపితలపులు
సరసాల సౌఖ్యాల ఆనందాల ఊయలలూగే
విరులపై మమకారాల మౌజులు
తుమ్మెదల వలపు దాడికి మూలకారణాలు
తుమ్మెదల వలపు దాడికి మూలకారణాలు
పరువాల బింకాల తబ్బిబ్బులు
తరిమిసే ఎడదలోని సందేహాల ఆంక్షలు
తరిమిసే ఎడదలోని సందేహాల ఆంక్షలు
వయసుపొంగు బాలమెరుపు
ఎల్లకాలం ఉండేనా కలకాలం నిలిచేనా
ఎల్లకాలం ఉండేనా కలకాలం నిలిచేనా
మెచ్చిన మనసు నచ్చినదైతే
తలపు వలపు తెరుచు
తలపు వలపు తెరుచు
నిజాయతినిష్ఠ ప్రేమలో కరువైతే
నిజస్నేహ రుచులు హరించు
.........
నిజస్నేహ రుచులు హరించు
.........

No comments:
Post a Comment